Current Affairs Telugu Daily

విక్టోరియాలో కారుణ్య మరణం చట్టబద్ధం
* చికిత్సకు సైతం స్పందించని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పౌరులు కారుణ్య మరణం కోసం అభ్యర్థించే అవకాశం ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో అందుబాటులోకి వచ్చింది.
* కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేస్తూ విక్టోరియా స్టేట్‌లో కొత్త చట్టాలు జూన్ 19న  అమలులోకి వచ్చాయి.
* కోలుకోవడానికి వీలులేనంత తీవ్ర అనారోగ్యంతో, చికిత్సకు కూడా స్పందించలేని పరిస్థితుల్లో బాధపడుతున్న రోగులకు ఈ చట్టాల వల్ల హుందాగా కారుణ్య మరణం పొందే అవకాశం కలుగుతుందని విక్టోరియా ప్రధాని డేనియల్‌ ఆండ్రూస్‌ పేర్కొన్నారు.

views: 669

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams