Current Affairs Telugu Daily

జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌కు సీఐఐ సదరన్‌ 5ఎస్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొనసాగుతున్న జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ లిమిటెడ్‌కు భారీ పరిశ్రమ-సేవా విభాగంలో ప్రతిష్ఠాత్మకమైన కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ సదరన్‌ రీజియన్‌ 5ఎస్‌ ఎక్సలెన్స్‌ 2018-19 పురస్కారం దక్కింది.
* జూన్ 14న చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ బృందం అందుకుంది.
* ఈ సందర్భంగా జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ లిమిటెడ్‌ సీఈఓ అశోక్‌ గోపీనాథ్‌ మాట్లాడుతూ.గత ఏప్రిల్‌లో సీఐఐకు చెందిన ఆడిటర్లు  జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ను సందర్శించారన్నారు.
* ఇక్కడి హ్యాంగర్లు, స్టోర్లు, వర్క్‌షాప్‌, యూటిలిటీ, ప్రాంగణం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు.
* జూన్ 18న  ఓ ప్రకటనలో ఆయన ప్రపంచ స్థాయి థర్డ్‌ పార్టీ ఎయిర్‌ ప్రేమ్‌ మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ అందిస్తున్న సేవలకు ప్రతిఫలంగానే ప్రపంచ స్థాయి పురస్కారం వరించిందని పేర్కొన్నారు. వినియోగదారుల సంతృప్తి, భద్రతతో పాటు సామర్థ్యం పెంపొందించుకోవడమే తమ ఉన్నత లక్ష్యం అన్నారు.

views: 702

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams