Current Affairs Telugu Daily

డ్రైవింగ్‌ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

* ఇప్పటివరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే కనీసం 8వ తరగతి వరకు చదివుండాలనే నిబంధన ఉంది.
* దీనివల్ల డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యం ఉండి చదువు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్లు లైసెన్స్‌  తీసుకోవాలంటే కుదిరేది కాదు.
* అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి.
* అలాంటివారి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి చదువుకోకపోయినా లైసెన్స్‌ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. 
* దీనికోసం అడ్డుగా ఉన్న మోటార్‌ వెహికల్‌ చట్టం 1989లోని 8వ నిబంధనను తొలగించబోతున్నారు.
* ఈ నిర్ణయం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు, రవాణా రంగం ఎదుర్కొంటున్న డ్రైవర్ల సమస్య కూడా  తీరనుంది.
* దేశంలో వేగంగా విస్తరిస్తున్న రవాణా, లాజిస్టిక్‌ రంగాల్లో దాదాపు 22 లక్షల డ్రైవర్ల అవసరం ఉందని అంచనా.

* ఈ విషయం గురించి కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ..
* గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువతకు డ్రైవింగ్‌లో నైపుణ్యంతో పాటు అనుభవం ఉన్నాకూడా చదువులేదనే నిబంధనతో లైసెన్స్‌కి అనర్హులయ్యేవారు.
 


views: 742

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams