Current Affairs Telugu Daily

లోక్‌సభలో కాంగ్రెస్‌ నేతగా  అధిర్‌

* పశ్చిమబెంగాల్‌కు చెందిన సీనియర్‌ లోక్‌సభ సభ్యుడు అధిర్‌ రంజన్‌ చౌధురి లోక్‌సభలో కాంగ్రెస్‌ నేతగా నియమితులయ్యారు.
* ఈ నియామకపు ఉత్తర్వులను లోక్‌సభ సెక్రటేరియట్‌కు పార్టీ వర్గాలు అందజేశాయి.
* ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీ అయిన అధిర్‌ రంజన్‌ ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెహరంపూర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

* లోక్‌సభలో పార్టీ నేతగా తనను నియమించడంపై అధిర్‌ రంజన్‌ కాంగ్రెస్‌ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విలేకరులతో అధిర్‌ అన్నారు.
* సామాన్య ప్రజల తరఫున పార్లమెంట్‌లో గళం వినిపిస్తానన్నారు.

*1999 నుంచి అధిర్‌ రంజన్‌ చౌధురి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. 
* 1996–1999 సంవత్సరాల్లో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు.
* యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా చేశారు.
* ప్రతిపక్ష నేత అర్హత సాధించేందుకు అవసరమైన 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లోక్‌సభలో లేకపోవడంతో ఆ హోదా దక్కలేదు.
* ఇలాంటి పరిణామం ఎదురుకావడం ఆ పార్టీకి వరుసగా ఇది రెండోసారి.


views: 772

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams