Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్‌ క్రిప్టోకరెన్సీ ‘లిబ్రా’ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి
 *ఫేస్‌బుక్‌ తన సొంత డిజిటల్‌ సొమ్ముతో క్రిప్టోకరెన్సీలోకి అడుగుపెట్టింది.
* ‘లిబ్రా’ పేరుతో జూన్ 18న  నాడు సరికొత్త గ్లోబల్‌ కరెన్సీని ఫేస్‌బుక్‌ ఆవిష్కరించింది.
* ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌గా ఉన్న ఫేస్‌బుక్‌.
* ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేపట్టే విధంగా ఈ క్రిప్టోకరెన్సీని తీర్చిదిద్దింది.
* లిబ్రా కోసం ఫేస్‌బుక్‌ ఇప్పటికే డజనుకు పైగా సంస్థలతో జట్టు కట్టింది.
* లిబ్రా పేరుతో తీసుకువచ్చిన క్రిప్టోకరెన్సీ ఓపెన్‌ సోర్స్‌ కోడ్‌గా ఉండనుంది.
* ఆసక్తి కలిగిన డెవలపర్లు ఎవరైనా యాప్స్‌ రూపంలోకి, సర్వీసులు, వ్యాపారాల్లోకి మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
* వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటల్‌ మనీని అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది.
* జెనీవా కేంద్రంగా ఉన్న నాన్‌ ప్రాఫిట్‌ సంస్థ ఒకటి బ్లాక్‌చెయిన్‌ ఆధారిత లిబ్రా వ్యవహారాలను పర్యవేక్షించనుంది.
* లిబ్రా పేరుతో ఉన్న క్రిప్టోకరెన్సీ విలువను స్థిరంగా ఉంచే విధంగా ఈ సంస్థ చర్యలు చేపట్టనుంది.
* ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు సేవలు (అన్‌బ్యాంక్డ్‌) అందుబాటులో లేని కోట్లాది మంది ప్రజలకు ఆన్‌లైన్‌ వాణిజ్యం, ఆర్థిక సర్వీసుల సదుపాయాలను అందించాలన్నదే తమ లక్ష్యమని లిబ్రా అసోసియేషన్‌ హెడ్‌ (పాలసీ) డాంటే డిస్పార్టే తెలిపారు.

views: 704

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams