Current Affairs Telugu Daily

17 వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
* ఓం బిర్లా 1962 నవంబరు 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. 
* ఓం బిర్లా అజ్మీర్‌లోని మహర్షి దయానంద్‌ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో మాస్టర్స్‌ చేశారు.
* బీజేవైఎంలో అంచెలంచెలుగా ఎదిగారు.
* 1987-91లో కోటా జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా..
*1991-97లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, 1997-2003లో బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
* బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓం బిర్లా ఆ విభాగంలో అనేక పదవులు నిర్వహించారు.
 
* కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓం బిర్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్యకు వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.
* 2003 నుంచి మూడుసార్లు రాజస్థాన్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
* 2004-08 వరకు రాజస్థాన్‌ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా ఉన్నారు.
* 2014లో కోటా నుంచి గెలిచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు.
* ఇటీవల ఎన్నికల్లోనూ ఆయన అదే స్థానం నుంచి విజయం సాధించారు.
* అణగారిన వర్గాలు, మహిళల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams