Current Affairs Telugu Daily

అంతరిక్ష యుగంలోకి శ్రీలంక, నేపాల్‌
* అంతరిక్ష యుగంలోకి శ్రీలంక, నేపాల్‌లు ప్రవేశించాయి.
* ఈ దేశాలు మొట్టమొదటిసారిగా రూపొందించిన ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోని జపాన్‌కు చెందిన కిబో మాడ్యూల్‌ ద్వారా కక్ష్యలోకి చేరాయి.
* శ్రీలంక ఉపగ్రహం పేరు ‘రావణ-1’. దీన్ని శ్రీలంకలోని పెరాడినియా విశ్వవిద్యాలయం, ఆర్థర్‌ సి క్లార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మోడర్న్‌ టెక్నాలజీస్‌ విద్యార్థులు రూపొందించారు.
*శ్రీలంక, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఇది ఫొటో తీయడం సహా పలురకాల విధులను నిర్వర్తిస్తుంది.
* నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఇది పరిభ్రమిస్తుంది.
* ఏడాదిన్నర పాటు సేవలు అందిస్తుంది.
* నేపాల్‌కు చెందిన నేపాలీశాట్‌-1ను అబ్బాస్‌ మాష్కే, హరిరామ్‌ శ్రేష్ఠ అనే శాస్త్రవేత్తలు రూపొందించారు.

views: 726

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams