Current Affairs Telugu Daily

17వ లోక్‌సభ ప్రారంభం
* కొత్త లోక్‌సభ కొలువుదీరింది. 17వ లోక్‌సభ జూన్ 17న ప్రారంభమైంది.
* ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు.
* ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది.
* జాతీయగీతాలాపన తర్వాత లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు, వారి నియోజకవర్గాల పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన నివేదికను సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవ సభలో ప్రవేశపెట్టారు.
*  ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమం మొదలైంది.
* తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తర్వాత ప్యానల్‌ ప్రొటెం స్పీకర్లయిన కొడికునిల్‌ సురేశ్‌, భర్తృహరి మెహతాబ్‌, బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం చేశారు.
* ఆ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ.. ఇలా కేంద్ర కెబినెట్‌ ర్యాంకు మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. 

views: 896



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams