Current Affairs Telugu Daily

భారత్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో  రోహిత్‌ శర్మ మూడు సిక్స్‌లు సాధించి ఇప్పటివరకూ మహేంద్రసింగ్‌ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును అధిగమించాడు.
* అంతర్జాతీయ క్రికెట్‌లో(అన్ని ఫార్మాట్‌లలో కలిపి) భారత్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా ధోనీ(355) పేరిట ఈ రికార్డు ఉండేది.
* తాజాగా పాక్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌(358) మూడు సిక్సర్లు కొట్టి ధోనీ రికార్డును అధిగమించాడు.  
* ఈ రికార్డు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ల జాబితాలో సచిన్‌ తెందుల్కర్‌(264), యువరాజ్‌ సింగ్‌(251), సౌరవ్‌ గంగూలీ(247), వీరేంద్ర సెహ్వాగ్‌(243) తర్వాతి స్థానాల్లో ఉన్నారు


views: 865

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams