Current Affairs Telugu Daily

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణం

* పదిహేడో లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 17న  ప్రారంభం కానున్నాయి.
* భాజపా ఎంపీ వీరేంద్ర కుమార్‌ నేడు ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
* వీరేంద్ర కుమార్‌ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు.
* రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
* లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు.
*  జూన్‌ 19న స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

* భాజపాలో ప్రముఖ  నేత అయిన వీరేంద్ర కుమార్‌ మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు.
* మోదీ గత ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు.


views: 818

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams