Current Affairs Telugu Daily

2019 మిస్‌ ఇండియా గా సుమన్‌రావు

రాజస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల సుమన్‌ రావు ఫెమీనా మిస్‌ ఇండియా అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రన్నరప్‌గా చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్‌ నిలిచారు. గతేడాది మిస్‌ ఇండియాగా నిలిచిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వాస్‌ ఈ కిరీటాన్ని సుమన్‌ రావుకి తొడిగారు.
*2018లో రన్నరప్‌గా నిలిచిన హరియాణకు చెందిన మీనాక్షీ చౌదరి..శివానికి కిరీటం ధరింపజేశారు. 2018లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయారావు కామవరపు తన కిరీటాన్ని..ఈ ఏడాది సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన తెలంగాణకు చెందిన సంజనా విజ్‌కు తొడిగారు. 

*మిస్‌ ఇండియా యునైటెడ్‌ కాంటినెంట్స్‌ -2019గా బిహార్‌కు చెందిన శ్రేయా శంకర్ నిలిచారు. మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2019 టైటిల్‌ను కూడా మిస్‌ ఇండియా మొదటి రన్నరప్‌ శివానీ జాదవ్‌కు దక్కించుకున్నారు. *ముంబయిలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. 


views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams