Current Affairs Telugu Daily

జిన్‌పింగ్, పుతిన్‌లతో మోదీ భేటీ
* కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు.
* ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు.
* జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా భారత్-చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై చర్చించామని మోదీ తెలిపారు.
* పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకొచ్చారు.

* ఎస్‌సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ మోదీ సమావేశమయ్యారు.
* ఈ భేటీలో భాగంగా భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు.
*బిష్కెక్‌లో ఎస్‌సీవో భేటీ జూన్ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది. 

views: 799

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams