Current Affairs Telugu Daily

మగవాళ్ల ద్వీపం ఒకినోషిమాకు ప్రపంచ వారసత్వ హోదా 
ఆడవాళ్లకు ప్రవేశం లేని జపాన్‌లోని ఓ చిన్న ద్వీపమైన ఒకినోషిమాకు ప్రపంచ వారసత్వ ప్రాంత హోదాను UNESCOప్రకటించింది. జపాన్‌లోని ప్రసిద్ధ క్షేత్రమైన ఇక్కడి ద్వీప దేవతకు తరతరాలుగా జపనీస్‌(షింటో) మతపెద్ద ఒకరు నిత్యం (365 రోజులు) పూజలు జరుపుతుంటారు. ఈ ద్వీపంలో మహిళలు అడుగుపెట్టడానికి వీళ్లేకుండా శాశ్వత నిషేధం ఉంది. కొరియా ద్వీపకల్పాన్ని, చైనాను కలిపే చోట ఈ ఒకినోషిమా దీవి ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 1000కి పైగా విశ్వఖ్యాతికి అర్హమైన ప్రాంతాలున్నాయి. స్మారక ప్రదేశాలు, ప్రకృతిసిద్ధ స్థలాలు, నగరాలు, నిర్మాణాలు, క్షేత్రాలు వంటివెన్నో ఇందులో చోటు చేసుకున్నాయి. భారత్‌లోని తాజ్‌మహల్‌, ఆస్ట్రేలియాలోని గ్రేట్‌ బేరియర్‌ రీఫ్‌, పెట్రా(జోర్డాన్‌)లోని రాతి కట్టడాల నగరం వంటివి ఉన్నాయి. పోలండ్‌లోని కాక్రాలో జరిగిన యునెస్కో హెరిటేజ్‌ కమిటీ 2017 జులై 9న ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి. దీంతోపాటు భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్‌ దీవుల్లోని టపుటపువాటీ అనే పొలినేషియన్‌ ట్రయాంగిల్‌ కూడా ఉంది. అలాగే, యూకేలో లేక్‌ డిస్ట్రిక్ట్‌, ఆఫ్రికా నుంచి నల్ల జాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరో లోని వలొంగో వార్ఫ్‌ కూడా ఉన్నాయి.
ఒకినోషిమా దీవి ప్రత్యేకతలు..
` జపాన్‌ (తూర్పు) సముద్రంలో ఉన్న ఈ ద్వీపంలో కేవలం 2 గంటల పాటు.. వార్షిక ఉత్సవానికి మాత్రమే పరిమిత సంఖ్యలో మగవాళ్లను అనుమతిస్తుంటారు. ఈ ఏడాది 200 మందికి మాత్రమే అనుమతించారు. 
` ఇక్కడ అడుగుపెట్టాలంటే సముద్రంలో నగ్నంగా స్నానం చేసి వెళ్లాల్సి ఉంటుంది. 
` వేలాదిగా బంగారు ఉంగరాలు, విలువైన వస్తువులు ఇక్కడ కనిపిస్తుంటాయి. దేశ సౌభాగ్యం విలసిల్లాలని, సముద్రయానం భద్రంగా సాగాలని ప్రార్ధిస్తూ భక్తులే వాటిని క్షేత్రంలో వేస్తుంటారు. 
` భవిష్యత్తులో మతపెద్దలు మినహా మిగతావారందరిపైనా నిషేధం విధించే అంశాన్ని క్షేత్ర అధికారులు పరిశీలిస్తున్నారు.
ఒకినోషిమా ద్వీపంలోకి మహిళ నిషేధం శతాబ్దాల తరబడి కొనసాగుతున్న ఆచారం. దీనివెనుక వివక్ష ఎంతమాత్రం కారణం కాదని చెబుతుంటారు.ఈ ద్వీపానికి సముద్రం గుండా ప్రయాణం చేయడం మహిళలకు ప్రమాదకరమని, బిడ్డకు జన్మనిచ్చే మహిళా లోకాన్ని కాపాడుకోవడమే నిషేధం వెనుక పరమార్ధంగా చెబుతుంటారు.
UNESCO-United Nations Educational, Scientific and Cultural Organization
41వ వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ సమావేశం ` క్రాకౌ (పోలండ్‌), 2017 జులై 2`12
40వ వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ సమావేశం ` ఇస్తాంబుల్‌(టర్కీ), 2016 జులై 10`20 

views: 841

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams