Current Affairs Telugu Daily

జిన్‌పింగ్‌కు కిర్గిజ్ అత్యున్నత పురస్కారం
* చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ’ లభించింది.
* కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్ ఈ అవార్డు ప్రదానం చేశారు.
* కిర్గిస్థాన్-చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య అభివృద్ధికి జిన్‌పింగ్ అందించిన ప్రత్యేక సేవలను ఈ సందర్బంగా సూరోన్‌బే ప్రశంసించారు.
* జిన్‌పింగ్ మాట్లాడుతూ, చైనా ప్రజలకు, కిర్గిజ్ ప్రజలకు మధ్య వున్న ప్రగాఢ మైత్రిని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందన్నారు. 

views: 783

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams