Current Affairs Telugu Daily

తెలుగులో ఇద్దరికి సాహిత్యఅకాడమీ అవార్డులు
* యువ, బాల సాహిత్య పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ  జూన్ 14న  ప్రకటించింది.
* ఇద్దరు తెలుగు సాహితీ వేత్తల రచనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయి. యువ పురస్కారాల్లో తెలుగు నుంచి గడ్డం మోహన్‌రావు రచించిన ‘కొంగవాలు కత్తి’ నవల, బాలసాహిత్య విభాగంలో బెలగాం భీమేశ్వరరావు రచించిన ‘తాత మాట వరాల మూట’ కథకు ఈ ప్రఖ్యాత పురస్కారాలు వరించాయి.
* గడ్డం మోహన్‌రావు ప్రస్తుతం ఓయూలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
* పరిశోధకుడిగా చిందు కళాకారుల జీవితాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు.
* చదివించే కథనం, సంఘటనలు, కళ్ల ముందు కదిలేలా అక్షరీకరించడం ఆయన శైలి ప్రత్యేకత. 
*  విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బెలగాం భీమేశ్వరరావు 1979 నుంచి 40 ఏళ్లుగా బాలసాహిత్యానికి సేవలందిస్తున్నారు. 
* 1000కి పైగా కథలు గేయాలు రచించారు. మహరాష్ట్రలో తెలుగు భాష అభ్యసించే విద్యార్థులకు ఈయన కథలు, నాటికలను పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. 

views: 899

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams