Current Affairs Telugu Daily

‘అక్షయపాత్ర’కు గ్లోబల్‌ చాంపియన్‌ అవార్డు
* బెంగళూరుకు చెందిన అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ ‘గ్లోబల్‌ చాంపియన్‌’ అవార్డు లభించింది.
* భారత్‌లోని వేలాది పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తున్నందుకు గాను ఆ సంస్థ ఈ పురస్కారానికి ఎంపికైనట్లు బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ విభాగం తెలిపింది.
* ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో సంస్థ ప్రతినిధులు అవార్డును స్వీకరించారు.
* ఈ సందర్భంగా అక్షయపాత్ర సీయీవో శ్రీధర్‌ వెంకట్‌ మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్‌ చాంపియన్‌ పురస్కారానికి ఎంపిక కావడం తమకు గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. * 20ఏళ్ల క్రితం ప్రారంభమైన అక్షయపాత్ర సంస్థ, నేడు దేశవ్యాప్తంగా పదిలక్షలమందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలను అందిస్తుండటం గమనార్హం.

views: 870

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams