Current Affairs Telugu Daily

షాంఘై సదస్సులో మోదీ ‘హెల్త్‌’ మంత్ర

* ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించే దేశాలు జవాబుదారీగా ఉండాలని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
* కిర్గిస్థాన్‌  రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు.
* ఉగ్రవాదంపై పోరాటంలో ఎస్‌సీవో దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలని కోరారు.
* ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్‌ కట్టుబడి ఉందన్నారు.  

* ఎస్‌సీవోలో భారత్‌ రెండేళ్లుగా శాశ్వత సభ్యదేశంగా ఉందని, ఈ రెండేళ్లలో ఎస్‌సీవో చేపట్టే అన్ని కార్యక్రమాలకు సానుకూల సహకారం అందించామని మోదీ తెలిపారు.
* అంతర్జాతీయ వేదికపై ఎస్‌సీవో విశ్వసనీయతను పెంచేందుకు మున్ముందు మరింత సహకారం అందిస్తామన్నారు.
* ఈ సందర్భంగా శ్రీలంకలో ఉగ్రదాడిని గురించి కూడా మోదీ ప్రస్తావించారు.
* ‘అక్షరాస్యత, సంస్కృతి సంప్రదాయాలు సమాజంలో సానుకూల దృక్పథాన్న పెంచుతాయి. * యువతలో తీవ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని మోదీ అన్నారు. 

‘హెల్త్‌’ మంత్రాన్ని పాటిద్దాం::

* ఈ సందర్భంగా ఎస్‌సీవో సభ్య దేశాలకు మోదీ హెల్త్‌ మంత్రాన్ని చెప్పారు.
* HEALTHలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉందని వివరించారు.
* ‘‘H అంటే హెల్త్‌ అండ్‌ మెడికేర్‌(ఆరోగ్య సహకారం),
*E అంటే ఎకో(పర్యావరణ సహకారం), A అంటే ఆల్టర్నేట్‌ కనెక్టివిటీ(సముద్రమార్గం ద్వారా ప్రత్నామ్నాయ అనుసంధానం),
* L అంటే లిటరేచర్‌(అక్షరాస్యతపై అవగాహన),
* T అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ(ఉగ్రవాద రహిత సమాజం),
* H అంటే హ్యుమానిటీ(మానవత్వ సహకారం)’’ అని మోదీ చెప్పుకొచ్చారు.  


views: 848



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams