Current Affairs Telugu Daily

యూనివర్సల్‌ ఓల్డేజ్‌ పెన్షన్’‌ పథకాన్ని అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా బిహార్‌

* ‘యూనివర్సల్‌ ఓల్డేజ్‌ పెన్షన్’‌ పథకాన్ని అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా బిహార్‌ .
* దీని ద్వారా రాష్ట్రంలో 60 ఏళ్లు‌ పైబడిన ప్రతి వ్యక్తీ తన ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం, కులాలకు అతీతంగా పెన్షన్‌ను అందుకుంటారు.
* ఇతర రాష్ట్రాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వృద్ధులు లేదా ఎస్సీ, ఎస్టీ, వితంతువులు, వికలాంగులు మాత్రమే ఈ పథకాన్ని అందుకుంటున్నారు.
* ఈ పథకానికి ముఖ్యమంత్రి వృద్ధజన్‌ పెన్షన్‌ యోజనగా పేరు పెట్టారు. 

* ఈ పథకం ద్వారా 80 ఏళ్లుపై బడిన వృద్ధుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.500 వేస్తారు.
* 60 నుంచి 80 మధ్య ఉన్న వారి ఖాతాల్లో రూ.400 వేస్తారు.
* ఏప్రిల్‌ 1, 2019 నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
* పదవీ విరమణ చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగానే పెన్షన్‌ వస్తుంది.
* వారికి ఈ పెన్షన్‌ పథకం వర్తించదు.
* ఈ పథకం కోసం రూ.18,000 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించినట్లు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తెలిపారు. 


views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams