Current Affairs Telugu Daily

హైకోర్టు న్యాయమూర్తులుగా మానవేంద్రనాథ్‌ రాయ్‌, వెంకటరమణ 

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎం.వెంకటరమణ నియమితులయ్యారు. 
* రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ జూన్ 11న  ఉత్తర్వులు జారీచేసింది. * వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది.
* వీరి నియామక విషయమై సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఏప్రిల్‌ 16న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ::
* ప్రస్తుతం ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ)గా సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ సేవలు అందిస్తున్నారు. స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం.
* జిల్లా జడ్జి కేడర్‌లో 2002లో ఎంపికయ్యారు.
* 2003 జనవరి 6 నుంచి అనంతపురం మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు.
* 2003 ఏప్రిల్‌ నుంచి 2006 ఏప్రిల్‌ వరకు విశాఖపట్నంలోని 4, 5, 6వ అదనపు జిల్లా జడ్జిగా సేవలందించారు.
* 2006 మే నుంచి 2009 ఏప్రిల్‌ 7 వరకు హైదరాబాద్‌లోని అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తిగా పనిచేశారు.
* విశాఖ జిల్లా జడ్జిగా(పీడీజే), రెండో అదనపు జిల్లా జడ్జిగా 2009 ఏప్రిల్‌ 13 నుంచి 2012 మార్చి 31 వరకు విధులు నిర్వర్తించారు.
* ఏప్రిల్‌ 2012 నుంచి 2013 ఏప్రిల్‌ వరకు కృష్ణా జిల్లా పీడీజేగా, 2013 ఏప్రిల్‌ నుంచి 2015 జూన్‌ 30 వరకు విశాఖ ఏపీ వ్యాట్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.
* 2015 జులై నుంచి హైకోర్టు ఆర్‌జీగా సేవలు అందిస్తున్నారు.
* ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో ఆర్‌జీగా కీలకపాత్ర పోషించారు.

ఎం.వెంకటరమణ ::
* ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి(పీడీజే)గా సేవలు అందిస్తున్నారు.
* స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి.
* 1982 ఫిబ్రవరిలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
* తండ్రి ఎం.నారాయణరావు న్యాయవాది. వెంకటరమణ తన తండ్రి వద్ద కొంత కాలం జూనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు.
* అనంతపురంలో సీనియర్‌ న్యాయవాది జయరాం వద్ద న్యాయవాద వృత్తిలో మెలకువలు నేర్చుకున్నారు.
* 1987 ఏప్రిల్‌ 1న జూనియర్‌ సివిల్‌ జడ్జి(జేసీజే)గా ఎంపికయ్యారు. చిత్తూరులో న్యాశారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి కర్నూలుపీడీజేగా విధులు నిర్వర్తిస్తున్నారు.


views: 852

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams