Current Affairs Telugu Daily

త్వరలో కొత్త కార్మిక చట్టం

* పెట్టుబడిదారులకు సహకరించడానికి, వృద్ధిని వేగవంతం చేయడానికి కొత్త కార్మిక చట్టాన్ని అమల్లోకి తేవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
* 44 కార్మిక చట్టాలను నాలుగు తరగతులుగా విభజించనుంది.
* వీటిని వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత-సంక్షేమం, పారిశ్రామిక సంబంధాలు అనే తరగతులుగా విభజించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌, వాణిజ్య -రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ తదితరులు పాల్గొన్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
* జులై రెండోవారంలో లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెడతామని గంగ్వార్‌ విలేకరులకు వెల్లడించారు.
* ఈ కొత్త చట్టాలపై ఇప్పటికే అన్ని పెద్ద కార్మికసంఘాలను ప్రభుత్వం సంప్రదించినట్లు చెప్పారు.

ఏ వర్గంలో ఏముంటాయంటే::
* సామాజిక భద్రత: ఈపీఎఫ్‌, ఇతర నిబంధనల చట్టం, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, భవనాలు- ఇతర నిర్మాణాల కార్మికుల, ఉద్యోగుల చట్టం.
* పారిశ్రామిక భద్రత-సంక్షేమం: కర్మాగారాల చట్టం, గనుల చట్టం, నౌకాశ్రయాల కార్మికుల చట్టం
* వేతనాలు: కనీస వేతనాలు చట్టం, వేతనాల చెల్లింపు చట్టం, బోనస్‌ చెల్లింపు చట్టం, సమాన జీతభత్యాల చట్టం, ఇతర చట్టాలు
* పారిశ్రామిక సంబంధాలు: పారిశ్రామిక వివాదాల చట్టం -1947, కార్మిక సంఘాల చట్టం -1926, పారిశ్రామిక ఉద్యోగిత చట్టం -1946.


views: 783

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams