Current Affairs Telugu Daily

దిల్లీ రక్షణకు అమెరికా క్షిపణి వ్యవస్థ
* అమెరికా నుంచి అధునాతనమైన ‘నేషనల్‌ అడ్వాన్స్డ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ సిస్టమ్‌-2’ (నాసామ్స్‌-2)ను కొనుగోలు దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది.
* దీనితోపాటు స్వదేశీ, రష్యా, ఇజ్రాయెల్‌ గగనతల వ్యవస్థలను సమకూర్చుకొని దిల్లీలో బహుళ అంచెల క్షిపణి రక్షణ కవచాన్ని మోహరించాలని భావిస్తోంది.
* తద్వారా దేశ రాజధానిని శత్రువుల డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణుల నుంచి రక్షించుకోవాలనుకుంటోంది. 
* నాసామ్స్‌-2 విక్రయానికి లాంఛనంగా ఆమోదం తెలుపుతూ అమెరికా త్వరలోనే ఒక తుది ముసాయిదాను భారత్‌కు పంపే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
* అమెరికాతో ఒప్పందం కుదిరాక నాసామ్స్‌-2 భారత్‌ చేతికి అందడానికి రెండు నుంచి నాలుగేళ్లు పట్టొచ్చు. 
* ఈ ఆయుధ వ్యవస్థకు బదులు తమ వద్ద నుంచి ‘టర్మినల్‌ హై అల్టిట్యూటడ్‌ ఏరియా డిఫెన్స్‌’ (థాడ్‌), ‘పేట్రియాట్‌ అడ్వాన్స్డ్‌ కేపబిలిటీ’ (పీఏసీ-3) క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని అమెరికా కోరుతోంది.
* నాసామ్స్‌ వ్యవస్థను నిర్దిష్టంగా దిల్లీ రక్షణ కోసం కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తోంది. దీనికి వేగంగా స్పందించే లక్షణం ఉంది. ఎస్‌-400 మాత్రం చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి రక్షణకూ ఉపయోగపడుతుంది. అది శత్రు బాంబర్లు, యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, క్షిపణులు, డ్రోన్లను 380 కిలోమీటర్ల పరిధిలో నాశనం చేయగలదు.
* దిల్లీ కోసం రూపొందించిన ఐదు అంచెల గగనతల రక్షణ ప్రణాళిక ప్రకారం వివిధ దశల్లో పలు రకాల ఆయుధాల మోహరింపు ఉంటుంది.

views: 803

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams