Current Affairs Telugu Daily

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ వీడ్కోలు

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. జూన్ 10న  ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌ ప్రస్థానం::

* యువీ 2000 సంవత్సరం అక్టోబర్‌లో కెన్యాపై అరంగేట్రం చేసి 304 వన్డేలు ఆడాడు. 
* ఈ ఫార్మాట్‌లో 14 శతకాలతోపాటు 42 అర్ధశతకాలు సాధించాడు.
* వన్డేల్లో 8701 పరుగులు పూర్తిచేయగా..
* 111 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
* 2017లో కటక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (150) చేశాడు. 
*  2003 అక్టోబర్‌లో సొంత మైదానం మొహాలీలో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు.
* మొత్తం 40 టెస్టులు ఆడి మూడు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు.
* ఈ ఫార్మాట్‌లో 1900 పరుగులు పూర్తి చేశాడు.
* టీ20ల్లో 58 మ్యాచ్‌లు ఆడి 1177పరుగులు చేయగా 9 వికెట్లు పడగొట్టాడు.
*  2012లో చివరిసారి టెస్టు మ్యాచ్‌  ఆడిన యువీ.
* 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.

2011 ప్రపంచకప్‌: ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌::
* 2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ..
* ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి సత్తా చాటాడు. 
* యువీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

* తొలిసారి 2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్‌ తనదైన ముద్ర వేశాడు.
* ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి క్రికెట్‌ ప్రపంచాన్ని మొత్తం తనవైపునకు తిప్పుకున్నాడు.
* ఆ మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.
* ధోనీ సారథ్యంలో టీమిండియా 2007, 2011లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు.

అవార్డులు::
⇒ 2012లో భారత ప్రభుత్వం క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుతో, 2014లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. 


views: 874

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams