Current Affairs Telugu Daily

మోదీ-జిన్‌ పింగ్‌ భేటీ

* భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌తో చర్చలు జరపనున్నారు.
* జూన్‌ 13-14 తేదీల్లో జరగనున్న షాంఘై సహకారం సంఘం (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌ పింగ్‌ల మధ్య భేటీ ఉంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్‌ జూన్  09ప్రకటించారు.
* తమ దేశాధ్యక్షుడు జూన్‌ 12 నుంచి 16 మధ్య కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌ల్లో పర్యటిస్తారని తెలిపారు.
* ఎస్‌సీఓ సదస్సు కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కేక్‌లో జరగనుంది.
*  చైనా ఆధ్వర్యంలో ఏర్పడిన ఎస్‌సీఓలో ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. 
* 2017లో ఇందులో భారత్‌, పాకిస్థాన్‌ చేరాయి. 

* జూన్‌ 12 నుంచి 14 వరకు జిన్‌ పింగ్ కిర్గిజిస్థాన్‌లోనే పర్యటిస్తారని లు కాంగ్‌ తెలిపారు. 
* మోదీ-జిన్‌ పింగ్‌ భేటీ అవుతారని ఇటీవల చైనాలోని భారత దౌత్యవేత్త విక్రమ్‌ మిస్త్రీ కూడా తెలిపారు. 
*  కిర్గిజిస్థాన్‌లో ఎస్‌సీఓ సమావేశం తర్వాత చైనా అధ్యక్షుడు తజికిస్థాన్‌ వెళ్లనున్నారు.
* జూన్‌ 14 నుంచి 16 మధ్య జరిగే సీఐసీఏ సమావేశంలో జిన్‌ పింగ్‌ పాల్గొంటారని చైనా తెలిపింది


views: 831

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams