Current Affairs Telugu Daily

శ్రీలంక పర్యటనలో ప్రధాని మోదీ
* ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 09 శ్రీలంకలో పర్యటించారు.
* ఏప్రిల్‌లో ఈస్టర్‌ నాడు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సెయింట్‌ ఆంథోని చర్చిని ఆయన సందర్శించారు.
* ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. 
* ఉగ్రదాడుల తర్వాత శ్రీలంకను సందర్శించిన తొలి విదేశీ నేత మోదీయే
* శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన నివాసానికి వెళ్లారు.
 
* మోదీకి మైత్రీపాల ప్రత్యేక కానుక ఇచ్చారు.
* తెలుపు టేకుపై చెక్కిన సమాధి బుద్ధ విగ్రహ నమూనాను బహూకరించారు.
* బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉండే ఈ బొమ్మ
* మైత్రీపాల నివాసం వద్ద ఆయనతో కలిసి మోదీ అశోక మొక్కను నాటారు. 
* కొలంబోలోని ఇండియా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 
* మోదీ పర్యటనలో భాగంగా భారత్‌కు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌, మాల్దీవుల సివిల్‌ సర్వీసెస్‌ కమిషన్‌ మధ్య ఒప్పందం కుదిరింది.

views: 763

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams