Current Affairs Telugu Daily

12వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన రాఫెల్‌ నాదల్‌

* ఈ స్పెయిన్‌ స్టార్‌ రికార్డుస్థాయిలో 12వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు.
* జూన్ 08 జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ 6–3, 5–7, 6–1, 6–1తో నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఓడించాడు.
* 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ తుది సమరంలో నాదల్‌ మూడు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు.
* 38 విన్నర్స్‌ కొట్టిన అతడు 31 అనవసర తప్పిదాలు చేశాడు.

* విజేత రాఫెల్‌ నాదల్‌కు ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్‌ థీమ్‌కు 11 లక్షల 80 వేల యూరోలు (రూ. 9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

*  టెన్నిస్‌ చరిత్రలో ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని అత్యధికంగా 11 సార్లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడా కారిణి మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) పేరిట ఉంది. తాజా టైటిల్‌తో  ఈ రికార్డును నాదల్‌ బద్దలు కొట్టాడు.

* నాదల్‌ 12 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019) సాధించగా.
* ఆరుసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు.
* ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్, థీమ్‌లపై రెండుసార్లు, రాబిన్‌ సోడెర్లింగ్, మరియానో పుయెర్టా, డేవిడ్‌ ఫెరర్, వావ్రింకాలపై ఒక్కోసారి గెలిచాడు.  

* 93 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య.
* కేవలం రెండుసార్లు మాత్రమే నాదల్‌ (2009లో సోడెర్లింగ్‌ చేతిలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో; 2015లో జొకోవిచ్‌ చేతిలో క్వార్టర్‌ ఫైనల్లో) ఓడిపోయాడు.

* 18 ఓవరాల్‌గా నాదల్‌ గెలిచిన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ (12 ఫ్రెంచ్‌; 3 యూఎస్‌ ఓపెన్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌).
* అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన రికార్డు ఫెడరర్‌ (20) పేరిట ఉంది.
*  ఓవరాల్‌గా నాదల్‌ కెరీర్‌లో 82 టైటిల్స్‌ సాధించాడు.
 


views: 850

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams