Current Affairs Telugu Daily

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ బార్టీదే 

* ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
* జూన్ 8 జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ బార్టీ 6–1, 6–3తో అన్‌సీడెడ్‌ మర్కెటా వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై ఘనవిజయం సాధించింది.
*70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ వొండ్రుసోవా నుంచి 23 ఏళ్ల బార్టీకి ప్రతిఘటన ఎదురుకాలేదు.
* ఫైనల్‌ చేరే క్రమంలో ఒక్క సెట్‌ కూడా కోల్పోని 19 ఏళ్ల వొండ్రుసోవా కీలక పోరులో నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోగలిగింది.
*ఈ విజయంతో యాష్లే బార్టీ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

* చివరిసారి 1973లో మార్గరెట్‌ కోర్ట్‌ ఈ వేదికపై ఆస్ట్రేలియాకు సింగిల్స్‌ టైటిల్‌ను అందించింది.
*ఈ గెలుపుతో బార్టీ జూన్ 10 న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది.
* 2011లో సమంత స్టోసుర్‌ (యూఎస్‌ ఓపెన్‌) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన ఆసీస్‌ ప్లేయర్‌గా బార్టీ నిలిచింది.
* విజేత బార్టీకి ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్‌ వొండ్రుసోవాకు 11 లక్షల 80 వేల యూరోలు (రూ.9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి


views: 889

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams