Current Affairs Telugu Daily

భారత్‌లో తొలి డైనోసార్‌ పార్క్‌ ప్రారంభం

*భారతదేశంలోనే తొలిసారిగా  రాక్షస బల్లుల శిలాజాల పార్కును గుజరాత్‌లోని మహిసాగర్‌ జిల్లాలో ప్రారంభించారు.
* బాలానిసోర్‌ సమీపంలోని రాయ్‌యోలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ను  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని ప్రారంభించారు.
* పార్కు మన దేశంలోనే తొలి డైనోసార్‌ పార్క్‌ అని,  ప్రపంచంలో మూడోదని తెలిపారు. ఐక్యతకు చిహ్నంగా నిలిచిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం తర్వాత , ఈ పార్కు గుజరాత్‌ రాష్ట్రానికి మరో కలికితురాయిగా నిలుస్తుందని అన్నారు. 

*అధునాతనమైన టెక్నాలజీ ఈ పార్క్‌ సొంతం.
* త్రీడీ ప్రొజెక్షన్‌, విర్చువల్‌ రియాలిటీ కూడిన ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
* డైనోసార్ల జీవిత పరిణామక్రమంతో పాటు, రాక్షసబల్లుల ప్రతిరూపాలను ఈ పార్కులో ఏర్పాటు చేశారు.
* ఇందులో  మొత్తం 10 గ్యాలరీలు ఉన్నాయి.
*  దాదాపు 65 మిలియన్‌ ఏళ్లనాటి రాక్షసబల్లుల చరిత్రను ఇక్కడ పొందుపరిచారు. *బాలానిసోర్‌లో 1980 ప్రాంతంలో పలు డైనోసార్‌ శిలాజాలు, వాటి గుడ్లు దొరికిన విషయం తెలిసిందే


views: 911

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams