Current Affairs Telugu Daily

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆళ్ల నాని, అంజాద్‌ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది.

మంత్రులకు కేటాయించిన శాఖలు:
1. ధర్మాన కృష్ణదాస్‌- రోడ్లు, భవనాలు
2. బొత్స సత్యనారాయణ- మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
3. పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
4. అవంతి శ్రీనివాస్‌- టూరిజం
5. కురసాల కన్నబాబు- వ్యవసాయం
6. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌- రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, స్టాంపులు (డిప్యూటీ సీఎం)
7. పినిపే విశ్వపరూప్‌- సాంఘిక సంక్షేమం
8. ఆళ్ల నాని- వైద్య, ఆరోగ్యం (డిప్యూటీ సీఎం)
9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం
10. తానేటి వనిత- మహిళా సంక్షేమం
11. కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
12. పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ
13. వెల్లంపల్లి శ్రీనివాస్‌- దేవాదాయ
14. మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ
15. మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్‌
16. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
17. ఆదిమూలపు సురేశ్‌- విద్యా శాఖ
18. అనిల్‌కుమార్‌ యాదవ్‌- ఇరిగేషన్‌
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనులు
21. కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్‌ (డిప్యూటీ సీఎం)
22. బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
23. గుమ్మునూరు జయరామ్‌- కార్మిక, ఉపాధి శిక్షణ
24. షేక్‌ అంజాద్‌ బాషా - మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
25. మాలగుండ్ల శంకర్‌ నారాయణ- బీసీ సంక్షేమం


views: 1091Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams