* భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇవాళ భూటాన్ బయల్దేరి వెళ్లనున్నారు.
* విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం.
* భూటాన్‌కు మన దేశం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటనే నిదర్శనమని ఈ సందర్భంగా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
‘‘మరోసారి భూటాన్ వెళ్లేందుకు, అపూర్వమైన ద్వైపాక్షిక భాగస్వామ్య బలోపేతం కోసం పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను...’’ అని జైశంకర్ ట్వీట్ చేశారు.
* ఈ పర్యటన సందర్భంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్‌చుక్, ప్రధాని లియోచెన్ డాక్టర్ లాటాయ్ త్షేరింగ్లతో పాటు భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్పో డాక్టర్ తండి డోరిజీలతో జైశంకర్ సమావేశం కానున్నారు.
* అర్ధికాభివృద్ధి, జలవిద్యుత్ సహకారం సహా పలు అంశాలపై ఇరుదేశాలు విస్తృత స్థాయి సంప్రదింపులు జరపనున్నాయి.