Current Affairs Telugu Daily

విప్రో ఛైర్మన్‌ గా రిషద్‌ ప్రేమ్‌జీ 

* విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ హెచ్‌.ప్రేమ్‌జీ, సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
 * జులై 30న ఆయన పదవీ విరమణ చేసి, తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీకి బాధ్యతలు అప్పగించనున్నారు.
* ప్రస్తుతం రిషద్‌ సంస్థ ముఖ్య వ్యూహాత్మక అధికారిగా, నాస్‌కామ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  * ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఆయన ప్రస్తుత పదవీ కాలం జులై 30న ముగియబోతోంద’ని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
* అయితే, బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక ఛైర్మన్‌గా అయిదేళ్లపాటు (2024 జులై వరకు) ఆయన కొనసాగనున్నారు.

* విప్రో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అబిదాలీ జెడ్‌.నీముచ్‌వాలాను తిరిగి నియమిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.
* రిషద్‌ ప్రేమ్‌జీని పూర్తి కాల డైరెక్టర్‌గా అయిదేళ్ల కాలానికి తిరిగి నియమిస్తూ తీర్మానం చేసింది. * ఆయన 2019 జులై 31 నుంచి 2024 జులై 30 వరకు ఈ పదవిలో ఉంటూ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 


views: 721

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams