Current Affairs Telugu Daily

జీ-20 సదస్సుకు నిర్మలా సీతారామన్‌
* జపాన్‌లో జరిగే జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరవుతున్నారు.జూన్ 8 నుంచి రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
*ఆర్థిక మంత్రిగా సీతారామన్‌కు ఇది తొలి విదేశీ పర్యటన.
* సీతారామన్‌తోపాటు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.
* అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, మౌలిక రంగంలో పెట్టుబడులు, అంతర్జాతీయ పన్ను విధానాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
* ఈ నెల 28-29 తేదీల్లో జపాన్‌లోని ఒసాకా నగరంలో జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. అందుకు సన్నాహంగా మే 8 నుంచి రెండు రోజుల పాటు జపాన్‌లోనే జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల భేటీ జరుగుతోంది.
G-20 Summit::
  • Chairperson: Shinzō Abe
  • Founder: Group of Seven
  • Founded: 26 September 1999

views: 753

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams