Current Affairs Telugu Daily

 ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు పార్లమెంట్‌లో 

*ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులు తీసుకునే పద్ధతిని నేరంగా పరిగణించే తలాక్‌ బిల్లును మళ్లీ పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.
* లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లోఉంది.
*16వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లుకు కాలం చెల్లింది.
*ఒకసారి లోక్‌సభలో బిల్లు ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నప్పుడు దిగువ సభ రద్దయితే ఆ బిల్లును కాలం చెల్లినదిగా పరిగణిస్తారు. 

*ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.


views: 752



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams