Current Affairs Telugu Daily

రక్షణమంత్రి హోదాలో సియాచిన్‌కు రాజ్‌నాథ్‌

*ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌ గ్లేషియర్‌కు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మే 03 వెళ్లారు.
*సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌, ఫార్వర్డ్‌ పోస్ట్‌ను సంద ర్శించారు.

*రక్షణ మంత్రి హోదాలో తొలిసారిగా రాజ్‌నాథ్‌ సియాచిన్‌ను సందర్శించారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ కూడా ఉన్నారు. 

*1984లో భారత్‌ సియాచిన్‌ గ్లేషియర్‌ ఆర్మీ బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటుచేసింది.
20000 అడుగుల ఎత్తులో ఉండే సియాచిన్‌లో చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్‌ 60 డిగ్రీలకు పడిపోతుంది.
*హిమపాతాలు, మంచు చరియలు విరిగిపడటం ఇక్కడ సర్వసాధారణం. 


views: 747

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams