Current Affairs Telugu Daily

నూతన జాతీయ విద్యా విధానం-2019 ముసాయిదాను ప్రభుత్వం సవరించింది
నూతన జాతీయ విద్యా విధానం-2019 ముసాయిదాను ప్రభుత్వం సవరించింది. పాత విధానం ప్రకారం 3-8ఏళ్ల వయసు మధ్య పిల్లలు హిందీ సహా మూడు భాషలు నేర్చుకోవాలన్న సూచనను ఎత్తివేశారు. 
*దాని స్థానంలో పిల్లలు తమకు నచ్చిన ఏవైనా మూడు భాషల్ని ఎంచుకునే వెసలుబాటును కల్పించారు. హిందీ తప్పనిసరి అన్న నిబంధనను ముసాయిదా నుంచి తొలగించారు. 
*‘త్రిభాషా సిద్ధాంతంలో వెసులుబాటు’ పేరిట చేసిన ఈ సవరణలో ‘‘విద్యార్థుల వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని వారు అభ్యసించాల్సిన మూడు భాషల్లో మార్పులు చేసుకోవడానికి ఆరు లేదా ఏడో తరగతిలో అవకాశం ఉంటుంది. అయితే వారికి మాధ్యమిక స్థాయిలో నిర్వహించే బోర్డు పరీక్షల్లో ఏదైనా మూడు భాషల్లో ప్రావీణ్యం ప్రదర్శించడం మాత్రం తప్పనిసరి. 

views: 823



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams