Current Affairs Telugu Daily

నౌకాదళ 24వ అధిపతిగా అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌
*భారత నౌకాదళ 24వ అధిపతిగా అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టారు.
*అడ్మిరల్‌ సునీల్‌ లాంబా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కొత నౌకాదళ అధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు.
* కరంబీర్‌ సింగ్‌ ఈ పదవిలోకి రాకముందు విశాఖపట్నం తూర్పు నేవల్‌ కమాండ్‌లో ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశారు.
*2021 నవంబరు వరకు కరంబీర్‌ సింగ్‌ ఆ పదవిలో కొనసాగుతారు.
*1980లో భారత నౌకాదళంలో చేరిన కరంబీర్‌ సింగ్‌ తరువాతి సంవత్సరంలో హెలికాప్టర్‌ పైలెట్‌ అయ్యారు.
*39 ఏళ్ల కెరీర్‌లో నౌకాదళంలో అనేక కీలక పదవులు చేపట్టారు.
*వైస్‌ అడ్మిరల్‌ హోదాలో ప్రాజెక్ట్‌ సీబర్డ్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు.

views: 867Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams