Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్  ఇన్‌చార్జ్‌ డీజీపీగా సవాంగ్‌
* ఇన్‌చార్జ్‌ డీజీపీగా గౌతం సవాంగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మే ౩౦న   ఉత్తర్వులు జారీ చేశారు.
* ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా గౌతం సవాంగ్‌కు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
*డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను స్టేషనరీ అండ్‌ ప్రింటింగ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.
*ప్రస్తుతం స్టేషనరీ ప్రింటింగ్‌ కమిషనర్‌గా ఉన్న త్రిపాఠీని సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
*అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఆ బాధ్యతల నుంచి తప్పించారు. 
*ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 
* ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ కార్యదర్శిగా షంషేర్‌ సింగ్‌ రావత్‌ను నియమించారు.
* ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
*పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్‌ను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించారు.

views: 842

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams