Current Affairs Telugu Daily

ట్రంప్‌, జిన్‌పింగ్‌లతో మోదీ భేటీ

దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం తర్వాత చేయబోయే విదేశీ పర్యటనలు కూడా దాదాపు ఖరారయ్యాయి.
*తొలి పర్యటనగా మాల్దీవులకు వెళ్లనున్న మోదీ ఈ ఏడాది ఇద్దరు అగ్రదేశాల అధినేతలను కూడా కలవనున్నారట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో ఆయన రెండు సార్లు ద్వైపాక్షిక భేటీలో పాల్గొనే అవకాశముంది. 
జూన్‌ 28,29న జపాన్‌లో జరగబోయే జి-20 సదస్సులో ట్రంప్‌తో సమావేశం కానున్నారు.
*చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అక్టోబరులో భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. అక్టోబరు 11న మోదీతో జిన్‌పింగ్‌ అనధికారిక భేటీలో పాల్గొనే అవకాశముందని సదరు వర్గాలు చెబుతున్నాయి. దీని కంటే ముందే జూన్‌ 13,14న కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యే మోదీ జిన్‌పింగ్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.  


views: 820

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams