Current Affairs Telugu Daily

తెలంగాణ లో జూన్‌ నుంచే కొత్త ఆసరా పింఛన్ 
రాష్ట్రంలోని 39 లక్షల మంది ఆసరా పింఛను లబ్ధిదారులకు 
వారికి నెలవారీ పింఛను ఇక రూ.2,016 మేర అందుతుంది.
*దివ్యాంగులకైతే రూ.3,016 లభిస్తుంది.
*పింఛను పెంపు జూన్‌ నుంచి అమలవుతుంది.
*అంటే జూలై నుంచి అందుకొనే పింఛన్లలో పెరుగుదల కనిపిస్తుంది. వృద్ధాప్య పింఛను అందుకొనేందుకు  ప్రస్తుత వయోపరిమితి 65 ఏళ్లు కాగా. 57 ఏళ్లకు కుదించనున్నట్లు ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులను చూపించినప్పటికీ.. ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు.
*పింఛను రెట్టింపు కావటం మినహా మిగతా నిబంధనలన్నీ  ఇంతకు ముందు మాదిరిగానే అమలవుతాయని తాజా ఉత్తర్వులు పేర్కొన్నాయి.
*రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ  మే 28న ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
 *అందుకు తగ్గట్టే 2019-20 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో అవసరమైన నిధులను కేటాయించింది. 
*రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర వర్గీకరణల కింద పింఛన్లను అందుకుంటున్నవారి సంఖ్య 39 లక్షల మేర ఉంది.
*సర్కారు తాజా నిర్ణయంతో వీరందరికీ¨  మేలు చేకూరుతుంది.
 *వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తే మరో 7 లక్షల మంది ఆసరా జాబితాలోకి వస్తారనే అంచనాతో ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను  కేటాయించింది.
*వృద్ధుల వయపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.

views: 779

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams