Current Affairs Telugu Daily

వీడియో గేమింగ్‌ వ్యసనమూ వ్యాధే : ప్రపంచ ఆరోగ్య సంస్థ
*స్మార్ట్‌ఫోన్‌లో వీడియో గేమ్‌ ఆడనిదే రోజు పూర్తవడం లేదా? రాత్రి మంచంపై పడుకుని కూడా వీడియో గేమ్‌ ఆడిన తరువాతే నిద్రకు ఉపక్రమిస్తున్నారా? ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా, చుట్టంచూపుగా ఎవరైనా మన ఇంటికి వచ్చినా వారిని పట్టించుకోకుండా స్మార్ట్‌ఫోన్‌ తెరపై వేళ్లను కదుపుతూ గడిపేస్తున్నారా?...
* ఇలాంటి వ్యసనాత్మక ప్రవర్తన కూడా ఒక వ్యాధేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తొలిసారిగా గుర్తించింది. *జెనీవాలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశంలో ‘గేమింగ్‌ డిజార్డర్‌’ను ‘అంతర్జాతీయ వ్యాధి’గా గుర్తిస్తూ, 2018 జాబితాలో చేర్చాలని పేర్కొంటూ సభ్యదేశాలు అధికారికంగా తీర్మానం చేశాయి.
*గేమింగ్‌ పరిశ్రమనే నమ్ముకున్న పలువురు ప్రతినిధులు ‘డబ్ల్యూహెచ్‌వో’ చర్యను నిరసించారు.
*నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. గేమింగ్‌ అనేది ‘ఇ-స్పోర్ట్‌’ అని, వినోదరంగంలో బిలియన్‌ డాలర్ల వర్షం కురిపిస్తోందని గుర్తు చేశారు.
*దీన్ని వ్యాధిగా గుర్తిస్తే ఔత్సాహికులు ఈ రంగంలోకి రావడానికి ప్రతిబంధకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams