Current Affairs Telugu Daily

ఆకాశ్‌-1ఎస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

 *భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆకాశ్‌ -1ఎస్‌ క్షిపణిని మే 27న  విజయవంతంగా పరీక్షించింది.
*ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి దీనిని ప్రయోగించింది.
*భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవోను రూపొందించింది.
* భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయీజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లను ఆకాశ్‌- 1ఎస్‌ సమర్థంగా కూల్చేయగలదు.
*కాగా, రెండు రోజుల వ్యవధిలో ఈ క్షిపణిని రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. *ఆకాశ్‌-1ఎస్‌ క్షిపణిని మే 25, 27న పరీక్షించినట్లు తెలిపింది. 
Defence Research and Development Organisation::

  • Founded: 1958
  • Headquarters: New Delhi

views: 815

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams