Current Affairs Telugu Daily

కేబినెట్‌ కార్యదర్శిగా రాజీవ్‌ గౌబా
*కేబినెట్‌ కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా. ప్రస్తుత కేబినెట్‌ కార్యదర్శిగా ఉన్న పి.కె.సిన్హా వచ్చే నెల 12న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో నియమితులయ్యారు
*1982వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన గౌబా ఝార్ఖండ్‌ కేడర్‌కు చెందిన వారు.
*ఝార్ఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
*వాజ్‌పేయీ ప్రభుత్వంలో జార్జి ఫెర్నాండెజ్‌ రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనకు ప్రయివేటు కార్యదర్శిగా పనిచేశారు. 
* కేంద్ర మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపితే తొలుత ఆయన ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా కొంతకాలం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తరువాతే సిన్హా నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.
*గౌబా స్థానంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా జమ్ము-కశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి.వి.ఆర్‌.సుబ్రహ్మణ్యం నియమితులయ్యే అవకాశం ఉంది

views: 736

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams