Current Affairs Telugu Daily

తెలంగాణ సహా 25 రాష్ట్రాలపై ’ప్లాస్టిక్‌ ఫైన్‌’
 *పర్యావరణానికి పెనుసవాలుగా మారిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్మూలించడంలో తగిన ప్రణాళికలు సిద్ధం చేయని 25 రాష్ట్రాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) .
*ఒక్కో రాష్ట్రం నెలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
* ఘన, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, నిర్మూలనపై ఈ ఏడాది మొదట్లోనే విచారించిన ఎన్జీటీ పర్యావరణానికి హానికలగని రీతిలో ఎలా నిర్మూలిస్తారో ప్రణాళికలు సిద్ధం చేసి, వాటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)కి ఏప్రిల్‌ 30లోగా సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది.
*గడువు దాటినా ప్రణాళికలు సమర్పించని రాష్ట్రాలు నెలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ ఆదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, పుదుచ్చేరిలను మినహాయించింది.
*మిగిలిన రాష్ట్రాలు స్పందించకపోవడంతో.. మే నెల పరిహారం కింద రూ.కోటి జమచేయాలని 25 రాష్ట్రాలను ఎన్జీటీ ఆదేశించింది.

views: 760

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams