*ఎగిరే శవపేటికలుగా అపఖ్యాతి మూటగట్టుకున్న మిగ్-21 విమానంలో మే 27న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ దనోవా ప్రయాణించారు.
*కార్గిల్ యుద్ధసమయంలో ప్రాణాలను అర్పించిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాకు నివాళుర్పించేందుకు నేడు మిగ్ -21 ‘మిస్సింగ్మెన్’ ఫార్మేషన్ ఫ్లైపాస్ట్ నిర్వహించారు.
*దీనికి స్వయంగా ధనోవానే నేతృత్వం వహించగా.. ఎయిర్ మార్షల్ నంబియార్ దీనిలో పాల్గొన్నారు.
*కార్గిల్ యుద్ధ సమయంలో ఐఏఎఫ్ నిర్వహించిన ఆపరేషన్ సఫేద్ సాగర్లో దేశం కోసం ప్రాణాలర్పించిన వాయుసేన వీరులకు నివాళులర్పించేందుకు ఐఏఎఫ్ మిస్సింగ్మెన్ ఫ్లైపాస్ట్ను నిర్వహిస్తుంది.
*ఇటీవల కాలంలో ఎయిర్ చీఫ్ మార్షల్ తరచూ మిగ్ -21లలో ప్రయాణించి వాయుసేనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
*ఇటీవల కోయంబత్తూరు సులూరులో కూడా ఆయన మిగ్ -21ను నడిపారు.
*ఐఏఎఫ్ వద్ద ఉన్న అత్యంత పాత మిగ్విమానంగా టైప్96 పేరు తెచ్చుకొంది.
views: 775