Current Affairs Telugu Daily

బ్రహ్మోస్‌ ప్రయోగం విజయవంతం 
 *బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది.
*కార్‌ నికోబార్‌ దీవుల్లో ఈ పరీక్ష జరిగింది.
*త్రివిధ దళాల ఉమ్మడి విన్యాసాల్లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు సైన్యం తెలిపింది. *270 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లక్ష్యంపైకి దీన్ని ప్రయోగించినట్లు వివరించింది.
*సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లే ఈ అస్త్రం నిర్దేశిత లక్ష్యంలోకి ఎంత లోపలికి చొచ్చుకెళుతుందన్నది పరిశీలించినట్లు పేర్కొంది.
*భారత్‌, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ అస్త్రం అత్యంత శక్తిమంతమైంది. *యుద్ధరంగంలో అనేకరకాల పాత్రలను ఇది పోషించగలదు.
* బహుళ లక్ష్యాలను ఛేదించగలదు.

views: 857



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams