Current Affairs Telugu Daily

 బ్రిటన్‌ ప్రధాన మంత్రి థెరెసా మే తన పదవికి రాజీనామా
*బ్రెగ్జిట్‌’ వ్యూహ ఖరారులో ఇబ్బందులు పడుతున్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి థెరెసా మే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
*జూన్‌ 7న కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచీ వైదొలగనున్నట్లు తెలిపారు.
*కొత్త ప్రధానిని ఎన్నుకొనే వరకూ ఆ పదవిలో కొనసాగనున్నట్లు వెల్లడించారు.
*ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి (బ్రెగ్జిట్‌) సంబంధించిన ప్రణాళికపై మంత్రుల మద్దతును కూడగట్టడంలో విఫలమైన నేపథ్యంలో థెరెసా ఈ నిర్ణయం తీసుకున్నారు.
* కొత్త ప్రధాని ఎంపిక జూన్‌ 10న ప్రారంభమవుతుంది. అప్పటివరకూ థెరెసా ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగుతారు. 
*ద్రవ్య లోటు, నిరుద్యోగాన్ని తగ్గించడం, మానసిక ఆరోగ్యానికి నిధులను పెంచడం వంటి అంశాల్లో తన ప్రభుత్వ విజయాలను థెరెసా వివరించారు.
* 28 సభ్య దేశాలు కలిగిన ఈయూ నుంచి మార్చి 29నే బ్రిటన్‌ వైదొలగాల్సింది. తాజాగా ఆ గడువు అక్టోబర్‌ 31కు పెరిగింది.
  • Capital: London
  • Currency: Pound sterling

views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams