Current Affairs Telugu Daily

ఇండియా ఓపెన్‌ టోర్నీ లొ భారత్‌కు 12 స్వర్ణాలు 
*ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీ కోమ్‌, సీనియర్‌ బాక్సర్‌ సరితా దేవి స్వర్ణాలతో ఇండియా ఓపెన్‌ టోర్నీని భారత్‌ ఘనంగా ముగించింది.
*ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 12 స్వర్ణాలను కైవసం చేసుకుంది.
*మహిళల 51, 57, 75 కిలోల్లో, పురుషుల 52, 81, 91, +91 కిలోల్లో పసిడి పతకాలు లభించాయి.  మే 24న జరిగిన 60 కిలోల ఫైనల్‌ బౌట్‌లో సరితా దేవి 3-2తో సిమ్రన్‌జిత్‌ కౌర్‌పై నెగ్గింది.
* 51 కిలోల ఫైనల్‌ ఫైట్‌లో భారత్‌కే చెందిన వాన్‌లాల్‌ దువాటిని మేరీ కోమ్‌ 5-0 నెగ్గి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
*సెమీ్‌సలో మేరీ చేతిలో ఓడిన తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తోపాటు జ్యోతి కాంస్యాలు సొంతం చేసుకున్నారు.
*పురుషుల 60 కిలోల ఫైనల్లో డిఫెండింగ్‌ చాంప్‌ మనీష్‌ కౌశిక్‌ను శివ థాపా చిత్తు చేశాడు.
*52 కిలోల్లో సచిన్‌ సివాచ్‌పై అమిత్‌ పంగల్‌ విజయం సాధించాడు.
*ఇదే కేటగిరీలో జాతీయ చాంపియన్‌ పీఎల్‌ ప్రసాద్‌, కామన్వెల్త్‌ స్వర్ణ పతక విజేత సోలంకి కాంస్యాలు దక్కించుకున్నారు.

views: 825



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams