Current Affairs Telugu Daily

ఐదోసారి ముఖ్యమంత్రి గా నవీన్ పట్నాయక్ 
*ఒడిసాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌(బీజేడీ) వరుసగా ఐదో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయనుంది .
* బీజేడీ 44.6% ఓట్లు, బీజేపీ 32.5%, కాంగ్రెస్‌ 16.1% ఓట్లు సాధించాయి.
* సీఎం నవీన్‌ పట్నాయక్‌ బిజాపూర్‌, హింజిలి నియోజకవర్గాల్లో విజయం సాధించారు. 
*జనతాదళ్‌ నుంచి విడిపోయి బిజూ జనతాదళ్‌ ఏర్పాటు చేసినప్పుడు తండ్రి ఖాళీ చేసిన స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు నవీన్‌. *బిజూపట్నాయక్‌ మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
*2000 సంవత్సరం నుంచి ఒడిశాలో తిరుగులేని నేతగా నిలిచారు. 
*ఉత్తమ ముఖ్యమంత్రిగా, పరిపాలనా దక్షుడిగా జాతీయ అవార్డులు అందుకున్న నవీన్‌ మహిళలకు రాజకీయాల్లో 30 స్థానాలు కేటాయించినందుకు ఐరాస ప్రశంసలు పొందారు.

views: 792

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams