Current Affairs Telugu Daily

ఒకే పార్టీ తరఫున ఐదేళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్న రెండో వ్యక్తిగా మోదీ 
*దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డులను ప్రధాని నరేంద్ర మోదీ తిరగరాశారు. నెహ్రూ తర్వాత ఒకే పార్టీ తరఫున ఐదేళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్న రెండో వ్యక్తిగా నిలిచారు
*దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 364 సీట్లు సాధించింది
*ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత ఆయన సారథ్యంలోనే రెండో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పట్లో లోక్‌సభలో 489 సీట్లు ఉంటే తన రికార్డును తానే తిరగరాసి వరుసగా రెండోసారి కాంగ్రెస్‌ ఏకంగా 371 సీట్లు సాధించింది.
*1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ (కాంగ్రె్‌స-ఆర్‌) ఏకంగా 352 సీట్లతో ఘన విజయం సాధించారు.ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు కేవలం 282 మాత్రమే. కానీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 300 సీట్లను సాధించింది.
*వరుసగా రెండోసారి గెలిచిన పార్టీ సాధించిన ఓట్ల శాతంలోనూ నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టారు.
* ఇప్పటి వరకు భారత ఎన్నికల చరిత్రలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ 2.79 శాతం మేరకే ఓట్లను మెరుగుపరుచుకుంది.
*1952 ఎన్నికలతో పోలిస్తే నెహ్రూ 1957లో 2.78 శాతం ఎక్కువ ఓట్లను సాధించారు.
*అలాగే, ఇందిర 1967తో పోలిస్తే 1971లో మూడు శాతం ఓట్లను ఎక్కువగా సాధించారు.
*నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ 2014తో పోలిస్తే 2019లో ఏకంగా 10 శాతం ఎక్కువగా ఓటు షేరును సాధించడం విశేషం.
 
**ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రధాని అయిన రెండో వ్యక్తి
*ఒక పార్టీ తరఫున ఐదేళ్లపాటు అధికారంలో ఉండి మళ్లీ ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
*గతంలో నెహ్రూ పేరిట మాత్రమే ఈ రికార్డు ఉంది. ఆయన 1952, 1957, 1962ల్లో వరుసగా ప్రధాని పదవిని చేపట్టారు.
*2004, 2009ల్లో మన్మోహన్‌సింగ్‌ రెండుసార్లు ప్రధాని అయ్యారు. కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీ సాధించలేదు.యూపీఏ తరఫున ఆయన ప్రధాని అయ్యారు.
*రాజీవ్‌గాంధీ 1984లో 414 సీట్లు సాధించి చిరస్మరణీయ విజయాన్ని సాధించినా రెండోసారి ప్రచార సమయంలో ఆయన శ్రీపెరంబదూర్‌లో శ్రీలంక తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

views: 847

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams