Current Affairs Telugu Daily

అరబ్‌ మహిళ అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి
సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్‌బుకర్‌ ప్రైజ్‌ 2019కిగానూ ఓ అరబ్‌ మహిళను వరించింది. ఒమన్‌కు చెందిన రచయిత్రి జోఖా అల్‌హార్తి(40) రాసిన ‘సెలస్టియల్‌ బాడీ’ నవలకు ఈసారి మాన్‌ బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. *లండన్‌లోని రౌండ్‌హౌస్‌లో బుకర్‌ప్రైజ్‌ను అందుకున్న అల్‌హార్తి, ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్‌ మహిళగా చరిత్ర సృష్టించారు.
*బ్రిటన్‌ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్‌హార్తి వర్ణించారు.
*ఈ అవార్డు కింద అందే రూ.44.60 లక్షల(64,000 డాలర్ల)ను అల్‌హార్తి, అనువాదకురాలు మార్లిన్‌ చెరిసగం పంచుకోనున్నారు. 
  • First awarded:1969

views: 895Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams