Current Affairs Telugu Daily

అల్ట్రా లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రం చుట్టొచ్చి చరిత్ర సృష్టించిన ఆరోహి పండిట్‌
ముంబైకి చెందిన 23  ఏళ్ల ఆరోహి పండిట్‌ ఒక్కతే అల్ట్రా లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రం చుట్టొచ్చి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆరోహి గుర్తింపు పొందింది.
*చిన్న పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లో బలమైన గాలుల మధ్య సాహసోపేతంగా 3వేల కిలోమీటర్లు ప్రయాణించింది. 17 ఏళ్ల నుంచే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడం మొదలుపెట్టిన ఆరోహి తన అట్లాంటిక్‌ ప్రయాణాన్ని స్కాట్లాండ్‌లో ప్రారంభించింది.
*ఆరోహి రైడ్‌ చేసిన ఎయిర్‌ క్రాప్ట్‌ పేరు మహి. ఇది సినస్‌ 912 రకానికి చెందిన లైట్‌-స్పోర్ట్‌ ఎయిర్‌క్రాప్ట్‌. ఒకే ఇంజన్‌తో పనిచేసే ఈ ఎయిర్‌క్రాప్ట్‌ కేవలం 400 కేజీల బరువు మాత్రం ఉంటుంది.
*చూడటానికి తెల్లని పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉంటుంది. ఆరోహి భారత్‌ నుంచి తన రైడ్‌ ప్రారంభించి పాకిస్తాన్‌, ఇరాన్‌, టర్కీల మీదుగా ఆగుకుంటూ యూరప్‌ మీదుగా స్కాట్లాండ్‌ చేరింది. అక్కడి నుంచి తన అట్లాంటిక్‌ యాత్రను ప్రారంభించి ఐస్‌లాండ్‌, గ్రీన్‌లాండ్‌ మీదుగా చివరకు కెనడాలో ల్యాండ్‌ అయింది. 

views: 715

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams